ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో విద్యుత్ కోతలతో జనం అల్లాడుతున్నారు. ఏపీ లోని ముఖ్యమైన నగరాలు విశాఖ, విజయవాడ, తిరుపతి లతో పాటు ఇతర పల్లెల్లోనూ కరెంటు కోతలు ఉంటున్నాయి. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో రోజుకు ఆరు గంటలకు పైగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు అధికారులు.
కొన్ని ప్రాంతాల్లో అయితే ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు విద్యుత్తు ఉండటం లేదు. రాత్రి సమయాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. అసలే వేసవి కాలం ఆపై కరెంటు కోతలు ఉండటంతో ప్రజలు.. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అటు రాజమండ్రిలో రాత్రి 9.30 గంటల నుండి విద్యుత్ కోతలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే… విద్యుత్ కోతలకు నిరసనగా రాజమండ్రి జాంపేట విద్యుత్ స్టేషన్ ముట్టడించాయి టిడిపి శ్రేణులు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది.