పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న విద్యుత్ సౌధను కాంగ్రెస్ పార్టీ ముట్టడించనుంది. విద్యుత్ ఛార్జీల తో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా నేడు విద్యుత్ సౌధ తో పాటు పౌరసరఫరాల కమిషనర్ కార్యాలయాల ముందు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయనుంది. ఈ ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ కార్యకర్తుల, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.
కాగ ఈ రోజు ఉదయం 10 : 30 గంటలకు నెక్లెస్ రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం కానున్నారు. అనంతరం నెక్లెస్ రోడ్ నుంచి విద్యుత్ సౌధ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దీని తర్వాత విద్యుత్ సౌధ వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. కాగ పోలీసులు అరెస్టు చేస్తే.. తమ పోరాటం పోలీసు స్టేషన్ లోనూ కొనసాగిస్తామని అన్నారు.