MAA ELECTION : మానిఫెస్టో ప్రకటించిన సివి ఎల్ నరసింహారావు.. వారందరికీ నెలకు రూ.10 వేలు !

-

మా అధ్యక్ష ఎన్నికల మానిఫెస్టో ను ప్రకటించారు నటుడు సివిఎల్ నరసింహారావు. 2011 సంవత్సరం లో మనం పాస్ చేసుకున్న రిజల్యూషన్ ను తాను ఎన్నికైతే… పర్ఫెక్ట్ గా అమలు చేస్తానని.. ఇది కనుక అమలు అయితే ఆర్టిస్టుల అందరికీ అవకాశాలు వస్తాయని తెలిపారు సివిఎల్ నరసింహారావు. ఈ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడే 50మంది సభ్యుల తో కమిటీ ఏర్పాటు చెయ్యాలి అనుకున్నామని…. వాళ్ల పేర్లు త్వరలో ఎనౌన్స్ చేస్తానని ప్రకటించారు.

cvl narasimha rao
cvl narasimha rao

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి మా సభ్యుడికి 3 లక్షల రూపాయలు సంవత్సరానికి వుండేలా ఆ అమౌంట్ మా కడుతుందని,… అది వచ్చే జనవరి నుంచి అమలు చేస్తామని వెల్లడించారు. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో మా మెంబర్ కి అసోసియేట్ మెంబర్ షిప్ సంపాదించడని.. పెన్షన్ ప్రస్తుతం 6 వేలు ఇస్తున్నారు… ఈ నవంబర్ నుంచి అది 10 వేలు ఇచ్చేలా చేస్తానని ప్రకటించారు.

ఆడవాళ్ళకు ఉపయోగ పడే ఆసరా ను 20 ఏళ్ల క్రితం పెట్టామని… మళ్ళీ దానిని రివైవ్ చేస్తామని ప్రకటించారు. ఆసరా కమిటీ లో వుండే 13 మంది పేర్లను త్వరలోనే ఎనౌన్స్ చేస్తానని… ఎవరైనా మా సభ్యుడు ఆకలి భాధలు పడుతుంటే అతను కాల్ చేసినా రెండు గంటలలో అతని ఇంటికి నెల రోజుల సరిపడా గ్రాసరిని పంపిస్తామని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో మీడియా ముందుకు వస్తానని సివిఎల్ నరసింహారావు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news