నేడు సీడ‌బ్ల్యూసీ కీల‌క‌ స‌మావేశం..

-

కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ నేడు అత్యంత కీల‌క స‌మావేశం నిర్వ‌హిస్తోంది. ప్ర‌ధానంగా పార్టీ నాయ‌క‌త్వంపై చ‌ర్చించనుంది. ఈ స‌మావేశాన్ని వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హిస్తోంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ప‌రాజ‌యం త‌ర్వాత అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి రాహుల్‌గాంధీ త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. ఇక అప్ప‌టి నుంచి తాత్కాళిక అధ్య‌క్షురాలిగా సోనియాగాంధీ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. వ‌యోభారం వ‌ల్ల ఆమె బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోనున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, బీజేపీని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనే స‌త్తా ఉన్న వారికి బాధ్య‌త‌లు అప్ప‌గించడంపై ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు.

rahul
rahul

అయితే.. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మార్పుకోరుతూ 23 మంది సీనియర్ నాయకులు తాత్కాలిక అధ్యక్షురాలికి లేఖ రాయడం ఆ పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలంటూ కొందరు నేతలు లేఖలు రాయడంతోపాటు బహిరంగంగా పేర్కొన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ తిరిగి అధ్యక్ష పదవి చేపట్టాలని మరి కొందరు నేతలు కోరుతుండ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news