సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు బిఆర్ఎస్ నేతలపై కించపరిచే విధంగా పోస్టింగులు చేస్తున్నారని ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు మాదాపూర్ లోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వార్ రూమ్ పై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కొనుగోలుకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సునీల్ కనుగోలు నేడు సిసిఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
వీడియోల మార్ఫింగ్, పోస్టింగులపై గంటపాటు సునీల్ కనుగోలను విచారించారు పోలీసులు. ఆయన స్టేట్మెంట్ ని రికార్డు చేసుకున్నారు. అయితే గతంలో కాంగ్రెస్ వారు రూమ్ కి తానే ఇన్చార్జినని మల్లు రవి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్లు రవికి సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 సిఆర్పిసి కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.