ఐపీఎల్ వీడియోతో ట్రాఫిక్ అవేర్నెస్.. ప్రమాదం ఎటు నుండి వస్తుందో తెలియదు !

-

ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచెస్ ఆసక్తికరంగా సాగుతున్నాయి. నిన్నటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ తో తలపడగా ముంబైపై ఏకంగా పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ నెగ్గి ప్లే ఆఫ్ కి చేరుకుంది. ఓపెనర్లు వార్నర్, సాహాలు అద్భుతంగా అడిగి 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. అయితే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో దవాల్ కులకర్ణి తలకి దెబ్బ తగిలింది. ఫస్ట్ ఇన్నింగ్స్ చివరి బాల్ జాసన్ హోల్డర్ వేయగా దాని కులకర్ణి గట్టిగా హిట్ ఇచ్చాడు. ఆ బాల్ బౌండరీ చేరువగా వెళ్లినా ఒక రెండు రౌండ్స్ తీయడానికి బ్యాట్స్మెన్ లు ప్రయత్నించారు.

ఈ సమయంలో ఫీల్డర్ బాల్ వికెట్ కీపర్ గా అందించే క్రమంలో అది అనుకోకుండా దవాల్ కులకర్ణి తలకు తగిలింది. ఇది నిన్నటి మ్యాచ్ లో కాస్త సంచలనంగా మారింది. అయితే దీన్ని ఉదహరిస్తూ సైబరాబాద్ పోలీసులు ఆ వీడియోని తమ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. షేర్ చేసి “ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు హెల్మెట్ ధరించండి క్షేమంగా ఉండండి అది ఆట అయినా రోడ్డు అయినా” అంటూ పేర్కొన్నారు. పోలీసులు చెప్పినట్టు కులకర్ణి కూడా హెల్మెట్ పెట్టుకుని ఉంటే అక్కడ అంత ఇబ్బంది కలిగి ఉండేది కాదేమో, కానీ ఆయన ఒట్టి క్యాప్ పెట్టుకోవడంతో ఆ బంతి నేరుగా తలకు బలంగా తగిలిందన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news