బన్నీ ఫాన్స్ కు గుడ్ న్యూస్ : పుష్ప నుంచి అదిరిపోయే అప్డేట్

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాగా పుష్ప మీద భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పుష్ప సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ఆగస్టు 13న రిలీజ్ కానుండగా… ఇవాళ ఆ సాంగ్ ప్రోమో ను విడుదల చేశారు పుష్ప సినిమా బృందం సభ్యులు. “దాక్కో దాక్కో మేక” అంటూ సాగే ఈ పాటను శివం పాడగా… దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సాంగ్ కు చంద్ర బోస్ లిరిక్స్ అందించారు. కాగా ఈ మూవీ పార్ట్ -1 ను ఈ ఏడాది చిరవర్ లో అంటే డిసెంబర్ 25 వ తారుఖున అన్నీ థియేటర్ల లో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news