ఏపీలోకి డైకిన్ సంస్థ‌ భారీగా పెట్టుబ‌డులు.. 3,000 మందికి ఉపాధి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌ముఖ ప్ర‌యివేటు కంపెనీ భారీగా పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధం అయింది. డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త‌గా ఫ్యాక్టరీని నిర్మించేందుకు అంగీక‌రించింది. ప‌రిశ్ర‌మ నిర్మాణానికి ఏకంగా శంకుస్థాప‌న కూడా చేశారు. ఈ కార్యక్ర‌మానికి భార‌త దేశంలో ఉన్న జ‌పాన్ రాయ‌బారి స‌తోషి సుజుకీ తో పాటే డైకిన్ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్, సీఈవో తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో కొత్త ప‌రిశ్ర‌మ‌ను నిర్మించ‌బోతున్నారు. 75.5 ఎక‌రాల్లో డైకిన్ సంస్థ త‌మ ప‌రిశ్ర‌మ‌ను నిర్మిస్తున్నారు. అందు కోసం రూ. 1,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. డైకిన్ సంస్థ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి అయితే.. దాదాపు 3,000 మంది కి ఉపాధి ల‌భించే అవ‌కాశం ఉంది. కాగ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌కు ఇది మూడో అతిపెద్ద ఉత్ప‌త్తి కేంద్రంగా ఉండ‌బోతుంది. అలాగే ద‌క్షిణ భార‌త దేశంలో మొట్ట మొద‌టి ఉత్ప‌త్తి కేంద్రంగా ఉండ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news