వినాయక చవితి నవరాత్రులు ఘనంగా ముగిశాయి. దీంతో గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరేందుకు పయనం అవుతున్నారు. దీంతో నగరవ్యాప్తంగా ఎటూ చూసిన డప్పుసప్పుళ్లు, డీజే సౌండ్స్ నడుమ యువకులు గణనాధులను నిమజ్జానికి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా యువతీయువకులు, పెద్దవారు అనే తేడా లేకుండా ఫుల్లుగా డ్యాన్సులు చేస్తున్నారు.ఘనంగా గణపయ్యలకు బైబై చెబుతున్నారు.
అయితే, వినాయక నిమజ్జనం రోజే అనుకోకుండా నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్ మణికొండలోని అల్కాపురి కాలనీలో శ్యామ్ ప్రసాద్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి గుండె పోటుతో మరణించాడు. ఆదివారం అల్కాపురి టౌన్ షిప్ గణేశ్ ఉత్సవ కమిటీ లడ్డూ వేలంపాటలో పాల్గొన్న శ్యామ్.. అనంతరం మండపం వద్ద డ్యాన్స్ చేశాడు. అయితే, డీజే సౌండ్స్, తీవ్రంగా అలసిపోవడంతో ఇంటికి వెళ్లగానే గుండెపోటుతో మరణించాడు. అతన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలపడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.