ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్‌వో అనే గ్రూప్‌కు చెందిన హ్యాకర్లు వాట్సాప్‌లోకి తాజాగా ఓ స్పైవేర్ వైరస్‌ను ప్రవేశపెట్టారు. యూజర్లకు వాట్సాప్‌లో మిస్డ్ వాయిస్ కాల్ వస్తే చాలు.. ఈ స్పైవేర్ యూజర్ ఫోన్‌లోకి ప్రవేశిస్తుంది.
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను అందిస్తూ వస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే రోజు రోజుకీ వాట్సాప్‌ను వాడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది కూడా. అయితే ఆ యాప్‌లో ఎన్ని సెక్యూరిటీ ఫీచర్లు కల్పించినా ఎప్పుడూ హ్యాకర్లు అందులో వైరస్‌ను ప్రవేశపెడుతూనే ఉన్నారు. దీంతో వాట్సాప్ యూజర్లకు సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి హ్యాకర్లు విజృంభించారు. వాట్సాప్‌లోకి వైరస్‌ను వదిలారు. దీంతో స్పందించిన వాట్సాప్ తన యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. యాప్‌ను నూతన వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది.
ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్‌వో అనే గ్రూప్‌కు చెందిన హ్యాకర్లు వాట్సాప్‌లోకి తాజాగా ఓ స్పైవేర్ వైరస్‌ను ప్రవేశపెట్టారు. యూజర్లకు వాట్సాప్‌లో మిస్డ్ వాయిస్ కాల్ వస్తే చాలు.. ఈ స్పైవేర్ యూజర్ ఫోన్‌లోకి ప్రవేశిస్తుంది. అనంతరం ఆ ఫోన్ హ్యాకింగ్‌కు గురవుతుంది. దీంతో ఆ ఫోన్‌లో ఉన్న యూజర్లకు చెందిన సమాచారం అంతా హ్యాకర్ల చేతిలోకి వెళ్తుంది. అలాగే ఆ ఫోన్ల కెమెరాలను కూడా ఆ స్పైవేర్ నియంత్రిస్తుందట. దీంతో యూజర్ ఫోన్‌ను వాడేటప్పుడు అతను ఏం చేస్తున్నాడనే విషయాన్ని ఆ స్పైవేర్ ఫోన్ కెమెరాతో రికార్డ్ చేసి ఆ ఫొటోలు, వీడియోలను హ్యాకర్లకు పంపుతుంది. ఇలా ఆ స్పైవేర్ మనకు సమస్యలను తెచ్చి పెడుతుంది.
అయితే వాట్సాప్‌లో కొత్తగా వ్యాప్తి చెందుతున్న ఈ స్పైవేర్ గురించి తెలుసుకున్న వాట్సాప్ డెవలపర్లు ఈ సమస్యకు పరిష్కారం కనుక్కున్నారు. వాట్సాప్ యాప్‌లోని సెక్యూరిటీ ఫీచర్‌లో ఏర్పడిన లోపం వల్లే ఇలా స్పైవేర్ వాట్సాప్‌లో వ్యాప్తి చెందుతుందనే విషయాన్ని తెలుసుకున్న వాట్సాప్ డెవలపర్లు వెంటనే ఆ లోపాన్ని సరిచేసి కొత్త వెర్షన్‌ను విడుదల చేశారు. దీంతో ఇప్పుడు వాట్సాప్ యూజర్లందరూ తమ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను నూతన వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని వాట్సాప్ డెవలపర్లు కోరుతున్నారు. కనుక మీరు కూడా మీ ఫోన్‌లో ఉన్న వాట్సాప్‌ను నూతన వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి. లేదంటే… హ్యాకర్ల బారిన పడతారు..!