బాబోయ్ ఎండలు.. మార్చిలోనే దంచేస్తున్నాయి.. వాతావరణ శాఖ ఏం అంటోంది అంటే..?

-

ఎండాకాలం ఇక మొదలైపోయినట్లే… తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలో పలు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. మార్చి నెల లోనే ఎండలు ఇంతలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో…. మార్చి రెండవ వారంలోనే వేసవి తాపం విపరీతంగా పెరిగింది. 40 డిగ్రీల సెల్సియల్స్ మార్చిలోనే దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. కేరళలో కూడా భారీగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఎండల కారణంగా గోవా లో స్కూల్స్ ని ఒంటిపూట నిర్వహిస్తున్నారు.

గత రెండు రోజుల నుండి గోవాలో ఎండలు మండిపోతున్నాయి. ఇంత ఎండ ఉంటే మనం ఉండడమే కష్టం. రాబోయే రోజుల్లో వేడిగాలులు చాలా ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంటోంది. మార్చి లో పలు ప్రాంతాల లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరే అవకాశం ఉంది. కేరళ రాష్ట్రం లో ఎండల తీవ్రత బాగా ఎక్కువగా ఉంది, తిరువనంతపురం, అల్లపుజ, కొట్టయం, ఎర్నాకులం, కొల్లం, కోజికోడ్, కన్నూర్ లో అయితే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుండి 45 డిగ్రీలకు నమోదవుతాయి. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడులో కూడా వేడి గాలుల ప్రభావం ఉంది. ఎండ వేడి బాగా తగిలినప్పుడు శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. ఎండలు బాగా పెరుగుతున్నప్పుడు ప్రజలు జాగ్రత్తగా తీసుకోవాలి. వడదెబ్బ మొదలైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎండా కాలంలో వీలైనంత ఎక్కువగా నీళ్లు తీసుకుంటూ ఉండండి. ఆల్కహాల్ టీ కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version