సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నేడు రిలీజ్ అయిన చిత్రం ‘దర్బార్’. మామూలుగా రజనీ సినిమా అంటేనే దానికి ఎటువంటి ప్రమోషన్లు అవసరం లేదు. సినిమా బాగుంటే కలెక్షన్ల తూఫాన్ మాత్రం పక్కా. అదీ కాకుండా మొట్టమొదటిసారి రజనీకాంత్ మరియు మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కాబట్టి అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి.
కానీ ఈరోజు ఉదయం వచ్చిన రిపోర్టుల ప్రకారం మొదటి భాగం సినిమా బాగున్నా రెండవ భాగంలో మాత్రం మురుగదాస్ తేలిపోయాడు అని. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా భారీగా జరిగినట్లు తెలుస్తోంది. హిందీలో 17 కోట్లు, తమిళనాడు థియేటిరికల్ 63 కోట్లు, ఇక తెలుగులో ఈ సినిమాకు 7.5 కోట్లు, కర్నాటకలో 7 కోట్లు, కేరళలో 5.5 కోట్లు, ఓవర్సీస్ చూసుకున్నట్టైతే 33 కోట్ల బిజినెస్ జరగగా, శాటిలైట్ సన్ టీవీ హక్కులు 33 కోట్లు, డిజిటల్ అమెజాన్‌లో 25 కోట్లు రాబట్టుకోగా, ఇక ఈ సినిమా ఆడియోకి 5 కోట్ల బిజినెస్ జరిగినట్టు సమాచారం.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే ఒక్క తమిళంలో తప్ప మరెక్కడా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు అయితే లేవు. తెలుగులో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కొరకు 14 కోట్లు సాధించాల్సి ఉండగా రెండు రోజుల వ్యవధిలో విడుదల అవుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మరియు ‘అల వైకుంఠపురం’ మధ్యలో ఈ టాక్ తో ఈ చిత్రం కలెక్షన్లు కొల్లగొట్టడం అసంభవం అనే చెప్పాలి.