సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఒక్క తమిళంలోనే కాకుండా టాలీవుడ్ లోనూ తిరుగులేని క్రేజ్ అండ్ మార్కెట్ ఉంది. ప్రతి సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా రజనీ సినిమాకు ఈ వయస్సులోనూ తిరుగులేని క్రేజ్ ఉంది. ఇక రజనీ తాజా సినిమా దర్బార్. రజనీ గత సినిమాలు తెలుగులో ప్లాప్ అయ్యాయి.
వరుసగా కబాలీ, కాలా, పేట సినిమాలు ప్లాప్ అవ్వడంతో రజనీ మార్కెట్ ఇక్కడ ఘోరంగా పడిపోతూ వస్తోంది. ఇక దర్బార్‌కు మురుగదాస్ డైరెక్టర్ కావడంతో పాటు నయనతార హీరోయిన్ కావడంతో మళ్లీ ఆశలు, అంచనాలు చిగురిస్తున్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే దర్బార్‌కు తెలుగులో ఓ మోస్తరు బిజినెస్ జరిగింది.
ఏరియాల వారీగా ‘దర్బార్’ ప్రీ రిలీజ్ బిజినెస్: (రూ.కోట్లలో) :
నైజాం – 5.2 కోట్లు
సీడెడ్ – 3.1 కోట్లు
ఆంధ్ర – 6.2 కోట్లు
————————————————
ఆంధ్ర – తెలంగాణ టోటల్ : 14.5 కోట్లు
————————————————
ఈ సినిమాకు ఏపీ, తెలంగాణలో రు 14.5 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే రు.15 కోట్ల షేర్ వస్తే ఇక్కడ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు. రజనీ గత సినిమాల బిజినెస్ చూస్తే పేట – 14 కోట్లు, 2.0 – 72 కోట్లు, కాలా – 33 కోట్లు, కబాలి – 32 కోట్లు బిజినెస్ చేశాయి. ఆ సినిమాలతో పోలిస్తే దర్బార్ బిజినెస్ చాలా చాలా తక్కువనే చెప్పాలి. మరి టార్గెట్ రజనీ రీచ్ అవుతాడో ? లేదో ? చూడాలి.