ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయ్యాాడు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఇవాళ ఉదయం చంచల్ గూడ జైలు నుంచి గీతా ఆర్ట్స్ ఆఫీస్ వద్దకు చేరుకున్నాడు అల్లు అర్జున్. వాస్తవానికి నిన్న రాత్రినే విడుదల కావాల్సి ఉండగా.. హైకోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వుల కాపీ ఆలస్యం కావడం.. లాయర్లు తీసుకొచ్చిన ఫార్మాట్ సరిగ్గా లేదని జైలు సూపరింటెండెంట్ అల్లు అర్జున్ ను జైలులోనే ఉంచారు.
అల్లు అర్జున్ విడుదలైన తరువాత పలువురు సినీ ప్రముఖులు ఆయనను తన నివాసంలో కలిసి వెళ్లారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా మరణించిన రేవతి కుటుంబానికి క్షమాపణలు చెప్పడంతో పాటు వారికి ఆర్థిక సహాయం అందజేస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రానున్నట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. సాయంత్రం 4 గంటలకు ప్రభాస్ వస్తారని తెలిపాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, సుధీర్ బాబుతో పాటు తదితర నటీనటులు బన్నీ నివాసానికి వచ్చారు.