బ్రేకింగ్: తెలంగాణ‌లో ద‌స‌రా సెలువు మ‌ళ్లీ పొడిగించారు..

-

తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె బాట పట్టడంతో ప్రజా రవాణా కుంటుపడింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా అవి పూర్తిస్థాయిలో లేవని విమర్శలు వస్తున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె వలన బస్సులు తిరగక పోవడంతో స్కూళ్లకు దసరా సెలవులను ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు గాను సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి అక్టోబరు 14 నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది.

కానీ సమ్మె కొనసాగుతుండడంతో 15వ తేదీ వరకు సెలవులు పొడిగించారు. కానీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరోసారి సెలవులు పొడిగించక తప్పలేదు. ఈ రోజు మధ్యహ్నం క్యాంప్ ఆఫీస్ లో ఆర్టీసీ మంత్రి అజయ్, అధికారులతో చెర్చించిన సీఎం… సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news