Dhamki : శివరాత్రికి “దమ్కీ” ఇవ్వనున్న విశ్వక్ సేన్

-

యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ‘ధమ్కి’ మూవీ చేస్తున్నాడు. కామెడీ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్నకుమార్ కథని సమకూరుస్తున్నాడు.

నివేదా పేతురాజు మరోసారి విశ్వక్ తో కలిసి నటించబోతుంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కరాటే రాజు నిర్మిస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను వదిలింది చిత్రం బృందం. “దమ్కీ” మూవీ రిలీజ్‌ డేట్‌ ను అనౌన్స్‌ చేశాడు విశ్వక్‌ సేన్‌. శివరాత్రి కానుకగా అంటే, ఫిబ్రవరి 17వ తేదీన “దమ్కీ” రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు విశ్వక్‌.

Read more RELATED
Recommended to you

Latest news