ముహూర్తం ఫిక్స్.. కొత్త మంత్రులు ఫిక్స్.. శాఖలు ఇవే?

-

ఇంకొక్కరోజు ఆగితే ఏపీలో కొత్త మంత్రులు “… అనే నేను” అంటూ ప్రమాణస్వీకారం చేయబోతోన్నారు. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, పిల్లి శుభాష్ చంద్రబోస్ లు ఖాళీ చేసిన ఈ పదవులపై రకరకాల గాసిప్స్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… ఒక మంత్రి విషయంలో శాఖతో సహా ఇప్పటికే క్లారిటీ వచ్చేసిన తరుణంలో… మరో మంత్రి పేరు కూడా దాదాపు ఫైనల్ అయ్యే అవకాశాలున్నయని అంటున్నారు.

ఈ నేపధ్యంలో అతి ముఖ్యమైన వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఉత్తరాంధ్రాకు చెందిన వారికి అప్పగిస్తారని ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో… శ్రీకాకుళం జిల్లా పలాసా ఎమ్మెల్యే, డాక్టర్ కూడా అయిన సీదరి అప్పలరాజుకి సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినట్లుగా చెబుతున్నారు. అందులో భాగంగా… వైద్యుడు కూడా అయిన సిదిరి అప్పలరాజుకి వైద్య శాఖ ఇచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

ఆయనకు మంత్రి పదవి ఖాయమని కూడా అంటున్నారు. శ్రీకాకుళం సంగతి అలా ఉంటే.. మిగిలిన మంత్రి పదవి తూర్పుగోదావరికి దక్కొచ్చని మాటలూ వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సతీష్, వేణుగోపాల్ ల పేర్లు బలంగా వినిపించిన నేపథ్యంలో.. వేణు పేరే ఫైనల్ అయ్య అవకాశాలున్నయని అంటున్నారు. గతంలో తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసినప్పటినుంచీ వైఎస్ ఫ్యామిలీతో వేణుకి మంచి అనుబందమే ఉందని అంటున్నారు!! ఈ లెక్కన అన్నీ అనుకున్నట్లు అనుకూలంగా జరిగిపోతేఏ 22 వ తేదీన వీళ్లిద్దరూ “… అనే నేను” అనడం ఖాయమని అంటున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news