ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాజ్యాంగానికే పెద్దపీట వేశారు. అయితే, ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి లోబడి.. ప్రజాప్రతినిధులకు కూడా అధికారాలు కట్టబెడతాయి. తర్వాత వరుసలో జిల్లాల అధికారులు ఉంటారు. ప్రజాప్రతినిధులకు.. జిల్లాల అధికారులైన కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు.. కొంతమేరకైనా విధేయులై ఉంటారు. దీంతో ప్రజలకు-ప్రజాప్రతినిధుల
అయితే, ఏపీలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు లబోదిబోమంటు న్నారు. అంటే.. తమకు-ప్రజలకు మధ్య ఉండే.. సున్నితమైన ప్రజాసంబంధాలు కొనసాగడం లేదని అంటున్నారు. దీనికి సీఎం జగనే కారణమనే వారు కూడా పెరుగుతున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు కూడా సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే నమ్ముతున్నారు తప్ప.. ప్రజా ప్రతినిధులను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎప్పుడు మీటింగులు పెట్టినా.. కలెక్టర్లు, ఎస్పీలతోనే మాట్లాడుతున్నారు.
వారికే అన్ని అధికారాలూ అప్పగించారు. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ.. ఎమ్మెల్యేలను డమ్మీ చేయడం ఏంటి? అంతా కలెక్టర్లే పాలించేటట్టయితే.. ఇక, ఎన్నికలు ఎందుకు.. తాము కోట్లరూపాయలు ఖర్చు పెట్టిపోటీ చేయడం ఎందుకు? అనే అసంతృప్తి నేతల్లో పెల్లుబుకుతోంది. ఈ పరిణామం ఎంతదూరం వెళ్తోదంటే.. ప్రజలు కూడా నేతలను పట్టించుకోవడం లేదు. తమకు ఏదైనా సమస్య ఉంటే.. ఒకప్పుడు ఎమ్మెల్యేల వద్దకు వచ్చేవారు. కానీ, ఇప్పుడు నేరుగా కలెక్టర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇక, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు కేవలం తోలుబొమ్మల్లా మారారనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో వీరంతా సీఎం జగన్‌పై తీవ్రంగా రుసరుసలాడుతున్నారు.
ఈ పరిణామం ఇలానే కొనసాగితే.. ఎన్నికల నాటికి “మేం మీకు ఎన్నో చేశాం.. మాకు ఓటేయండి“ అనే అర్హత కూడా కోల్పేయే పరిస్థితి వస్తుందనే ఆవేదన నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల అధికార పార్టీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. మీడియాతో ఆఫ్‌ది రికార్డుగా చెప్పింది కూడా ఇదే! “మాదేముంది తమ్ముడూ.. అంతా బాస్‌దే“ అనేశారు. ఇక్కడ బాస్ అంటే.. జగన్ కాదు.. కలెక్టర్. మరి ఇలాంటి పరిస్థితి కొనసాగితే.. ప్రమాదమే. గతంలో చంద్రబాబు సగం-సగం అన్నట్టుగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు కూడా అధికారాలు పంచారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.