బాలీవుడ్ అగ్ర నటుడు రిషీ కపూర్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు ఎలాంటి హడావుడి లేకు౦డా పూర్తి చేసారు. లాక్ డౌన్ కారణంగా ప్రముఖులు ఎవరూ కూడా ఆయన అంత్యక్రియలకు రాలేదు. దీనితో ఎలాంటి ఆడంబరం లేకుండా అంత్యక్రియలను కుటుంబ సభ్యులు పూర్తి చేసారు. ఆయన అభిమానులకు కూడా ఆయన చివరి చూపు దక్కలేదు. చివరకు ఆయన కుమార్తె కూడా చివరి చూపు దక్కలేదు.
కుమార్తె రిద్ధిమా కపూర్ నాన్న చివరి చూపుకు కూడా నోచుకోకపోవడం కన్నీరు పెట్టిస్తుంది. ఆమె ప్రస్తుతం ఢిల్లీ లో ఉన్నారు. లాక్ డౌన్ ఉండటంతో ఆమెతో పాటు గా మొత్తం 5 మంది ఢిల్లీ ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అయితే అనుమతి రావడం చాలా ఆలస్యం అయిపోయింది. దీనితో ఆమెకు చివరి చూపు కష్టం అయిపోయింది. ఆ తర్వాత రోడ్డు మార్గం గుండా బయలుదేరాలని భావించారు.
సాయంత్రం 5 గంటలలోగా అంత్యక్రియలు ముగించాలని ముంబై పోలీసులు నిబంధనలు విధించారు. దీనితో ఆమె చేరుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక ప్రైవేట్ విమానం ద్వారా వెళ్ళాలి అనుకున్నారు. అది కూడా సాధ్యం కాలేదు. లాక్ డౌన్ ఉండటం తో అలా ఒకరు వెళ్తే మిగిలిన వారిని కూడా అనుమతించాలి. ఇర్ఫాన్ ఖాన్ అంత్యక్రియలు కూడా ఇలాగే సాదాసీదా గా ముగిసాయి.