ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు.ఈ క్రమంలోనే జిల్లాలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ఎర్రుపాలెంలో గల ఇందిరా మహిళా డెయిరీ యూనిట్.. పాల శీతలీకరణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రతి ఏడాదికి రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
దీనికి తోడు ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తామని వెల్లడించారు. అయితే, సమాజాన్ని గొప్పగా నడిపించేలా మహిళలు ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. దసరా పండుగ నేపథ్యంలోనూ మంత్రులు తమ తమ నియోజకర్గాల్లో బిజీబిజీగా గడుపుతున్నట్లు సమాచారం.