దసరా పండుగ వేళ రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు జర్నీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆర్టీసీ బస్సులో చెకింగ్ అధికారులపై ప్యాసింజర్స్ సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చిన్న తుమ్మలగూడెంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అర్ధరాత్రి 11 గంటలకు రన్నింగ్ బస్సును ఆపి మహిళల ఆధార్ కార్డులను ఆర్టీసీ చెకింగ్ స్వ్కాడ్ తనిఖీలు చేసింది.
దీంతో పలువురు ప్యాసింజర్స్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆధార్ కార్డులు చూపించాకే టికెట్ ఇచ్చాక ఇప్పుడు మళ్లీ తనిఖీలు ఏంటని వారిని ప్రశ్నించారు. అధికారుల చర్యలతో అసహనానికి గురైన మహిళలు సైతం మాకు మీ ఫ్రీ బస్ వద్దు.. ఏమీ వద్దు అంటూ ఫైర్ అయ్యారు.ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్తామని పలువురు ప్రయాణికులు చెప్పడంతో అధికారులు వెంటనే దిగి వెళ్లిపోయారు. ఆర్ధరాత్రి ఈ చెకింగ్‌లు ఏంటీ సార్? అంటూ ఎండీ సజ్జనార్‌కు ఈ వీడియోను ట్యాగ్ చేశారు.