నాగార్జునసాగర్ ఉదంతం మరువకముందే నల్లగొండలో మరో ఘోరం చోటు చేసుకుంది. నల్లగొండ మున్సిపాలిటీలోని 11 వార్డ్ పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో శవం లభ్యమైంది. ఇదే నీళ్లను గత పది రోజులుగా తాగుతున్నారు నల్లగొండ మున్సిపాలిటీ ప్రజలు. వాటర్ ట్యాంకులో వాటర్ చెక్ చేయగా డెడ్ బాడీ ప్రత్యక్షం అయింది. మృతదేహం హనుమాన్ నగర్ కి చెందిన ఆవుల వంశీగా గుర్తించారు.
దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన.. కోతల్లేని కరెంట్ ఇవ్వలేరు.. కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరు.. కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోరు చివరికి.. నల్గొండలోని నీటిట్యాంకులో పదిరోజులుగా శవం ఉన్నా నిద్రలేవరు సాగర్ ఘటన స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే.. కాంగ్రెస్ సర్కారులో మళ్లీ అదే నిర్లక్ష్యం.. అదే నిర్లిప్తత.. సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారిది ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన ఇది మిషన్ భగీరథ పథకంతో.. దశాబ్దాల తాగునీటి తండ్లాటను తీరిస్తే.. కనీసం నీటిట్యాంకుల నిర్వహణ కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వమిది గుర్తుంచుకోండి.. జలమే జగతికి మూలం.. ఈ సర్కారు తీరు మారకపోతే.. జనమే కాంగ్రెస్ ను తరిమికొట్టడం ఖాయం అని ట్వీట్ చేశారు.