తిరుమల ఆలయంలో అపశృతి.. భక్తుడి మృతి!

-

తిరుమల ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. వేంకటేశ్వర స్వామి దర్శనార్థం అన్ని కంపార్టుమెంట్‌లో భక్తులు క్యూలో వేచి ఉన్నారు. అందులో ఓ భక్తుడు హఠాత్తుగా మరణించాడు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన వేదాచలం అనే భక్తుడు కుటుంబసభ్యులతో కలిసి తిరుమల దర్శనానికి వచ్చాడు. శ్రీ వారి దర్శనానికి వెళ్తుండగా సృహ తప్ప పడిపోయిన వేదాచలం స్పృహ తప్పి పడిపోయాడు. పరిస్థితి విషమించడంతో వేదాచలం ప్రాణాలు కోల్పోయాడు. క్యూలో ఊపిరాడక వేదాచలం కళ్లు తిరిగి పడిపోయినట్లు స్థానికులు తెలిపారు.

Tirumala-Temple
Tirumala-Temple

స్థానికులు అంబులెన్స్ సాయంతో వేదాచలంను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వేదాచలం కిందపడిన వెంటనే బయటకు తీసుకురావడానికి కుటుంబసభ్యులు తీవ్ర అవస్థలు పడ్డామని కుటుంబీకులు తెలిపారు. ఆస్పత్రికి తరలించిన క్రమంలో ఆలస్యం జరగడం వల్లే వేదాచలం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news