కేంద్రం తీసుకొచ్చిన ఆ బిల్లు.. రైతులకు డెత్ వారెంట్..?

-

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది అన్న విషయం తెలిసిందే. వ్యవసాయ బిల్లులోని ప్రతిపాదనలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూనే ఉన్నాయి. కాగా లోక్ సభలో ఆమోదం పొందిన బిల్లు నేడు రాజ్యసభలో కి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఎంతోమంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకత వ్యక్తం చేయగా… ఇటీవలే కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బస్వా ఈ బిల్లుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేంద్రం తీసుకు వచ్చిన బిల్లు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ డెత్ వారెంట్ అలాంటిది అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రైతులకు అన్యాయం చేసే బిల్లులకు తాము ఎప్పుడూ మద్దతు ఇవ్వబోమని అంటూ స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు కారణంగా రైతులకు ఉన్న కనీస మద్దతు ధర తొలగి పోయే ప్రమాదం ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ బిల్లుతో వ్యవసాయ మొత్తం కార్పోరేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని ఆయన తెలిపారు. కాగా ప్రతిపక్షాల విమర్శలు మధ్యే రాజ్య సభ వేదికగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు ఆమోద ముద్ర పొందినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news