దెబ్బ అదుర్స్​.. చెంపదెబ్బల గేమ్ ఎక్కడో తెలుసా​..!

-

ఈ ప్రపంచంలో ఎన్నో రకాల విచిత్రమైన గేమ్స్ ఉన్నాయి. వాటిలో చెంప దెబ్బల గేమ్ కూడా ఒకటి. ఇది రష్యాలో ప్రాచుర్యం పొందని ఒక ఆట. ఇది ప్రమాదకరమైన గేమ్ కాబట్టే… దీన్ని తక్కువ మందే ఆడుతారు. అందుకే ఇది ఫేమస్ కాలేదు. ఈ గేమ్​లో ఎవర్ని బడితే వాళ్లను ఆడనివ్వరు. పాల్గొనేవారు కొద్దిగానైనా బలంగా ఉండాలి. గేమ్ రూల్స్ ఎలా ఉంటాయంటే… పాల్గొనే ఇద్దరు వ్యక్తులు… ఎదురెదురుగా నిల్చోవాలి. చెంపలపై చేతులు పెట్టుకోకుండా… రెడీ అన్నట్లు ఉండాలి. చెంప దెబ్బ కొట్టే వ్యక్తి ముందుగా… తన ప్రత్యర్థిని కళ్లలో కళ్లు పెట్టి చూడాలి. అంటే కొట్టేందుకు రెడీగా ఉన్నా అన్నా అని అర్థం. ఆ సమయంలో… ప్రత్యర్థి తన చెంపను రెడీగా పెట్టాలే తప్ప… తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు. అదీ మరి రూల్ అంటే. ఒకవేళ దెబ్బ నుంచి తప్పించుకున్నాడంటే ఓడిపోయినట్టే లెక్క.

slapping
slapping

ఈ గేమ్‌లో ఒకరి తర్వాత ఒకరు చెంపలపై కొట్టించుకుంటూనే ఉంటారు. ఇద్దరిలో ఎవరో ఒకరు… ఏదో ఒక సమయంలో “వామ్మో… ఇంకొద్దు… నావల్ల కాదు” అనే పరిస్థితి వస్తుంది కదా… అప్పటివరకూ కొట్టుకుంటూనే ఉంటారు. అలా ఎవరో ఒకరు బతిమలాడటంతో… ఈ పోటీ ముగుస్తుంది. కొట్టొద్దు అన్న వ్యక్తి ఓడిపోయినట్లే. అయితే ఈ గేమ్‌కి కూడా ఒక రిఫరీ ఉంటారండోయ్​.. అతను ప్లేయర్లు ఎప్పుడు కొట్టుకోవాలో, ఎప్పుడు ఆపాలో డిసైడ్ చేస్తారు.

ఈ ఆటలో పాయింట్లు ఉండవు. ఒకరి తర్వాత ఒకరు కొట్టించుకోవడమే. టైమ్ లిమిట్ కూడా ఉండదు. ఒక వ్యక్తి కొట్టాక… అవతలి వ్యక్తి… ఆ చెంప దెబ్బ తిని… కాసేపు ఆపసోపాలు పడి… తిరిగి కోలుకొని… తనను కొట్టిన వ్యక్తి చెంపను చెళ్లు మనిపిస్తాడు. అలా ఇద్దరికీ కోలుకునే ఛాన్స్ ఇస్తారు. దీన్ని స్థానికంగా బార్రికో గేమ్ అంటున్నారు. గత మార్చిలో క్రాస్ నాయెస్క్‌లోని సైబీరియన్ పవర్ షో ఈవెంట్‌లో ఈ చెంప దెబ్బలాట జరిగింది. అందులో వాసిలీ కామొటె స్కీ విజేతగా నిలిచాడు. అతను పొందిన గ్రాండ్ ప్రైజ్ రూ.32,000.

Read more RELATED
Recommended to you

Latest news