ఆర్ ఆర్ ఆర్ లో గళం వినిపించనున్న ఆలియా..?

ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ, ఆలియా భట్ ఫీమేల్ లీడ్ గా కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం ఆలియా, హైదారాబాద్ కి రానుంది. ఐతే తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ లో ఆలియా గొంతు వినిపించనుందట.

ఆర్ ఆర్ ఆర్ లో ఒకానొక ప్రత్యేక గీతాన్ని ఆలియా ఆలపించనుందని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఆలియా, ఇది వరకు చాలా సినిమాల్లో పాటలు పాడింది. అవనీ సూపర్ హిట్ గా నిలిచాయి కూడా. ఐతే ఈ సారి అటు హిందీతో పాటు తెలుగులో కూడా పాడి వినిపిస్తుందట. ఇప్పటికే తెలుగు భాష నేర్చుకుంటున్న ఆలియా, పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువయ్యే అవకాశం ఉంది.