ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా

-

ఏపీలో కరోనా కేసులు టెన్షన్ పుట్టిస్తున్నాయి. గతంలో రోజుకు 10 వేల దాకా నమోదైన కేసులు ప్రస్తుతానికైతే చాలా తక్కువగానే నమోదవుతున్నాయి. స్కూల్స్ కూడా తెరుచుకోవడంతో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది చెప్పాలి. ఏపీలో సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు కూడా కరోనా వైరస్ బారిన ఎక్కువగా పడుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పలువురు ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో తిరుపతి ఎంపీ ఈ వైరస్ ప్రభావంతో మరణించారు కూడా.

మిగతా వారు దాదాపు కరోనా నుండి కోరుకున్నట్టే చెప్పాలి. అయితే ఇప్పుడు ఏపీలో మరో అధికార పార్టీ ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడినట్టు సమాచారం అందుతోంది. ఆయన మరెవరో కాదు కృష్ణాజిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు. ఆయనకు దూరంగా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నట్టు చెబుతున్నారు. ఆయనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో ముందు జాగ్రత్తగా కరోనా టెస్ట్ చేయించుకోవడంతో అందులో పాజిటివ్ అని తేలింది. ఇక కొద్దిరోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వాళ్ళందరిని జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా కరోనా టెస్ట్ కు వెళ్లాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news