డిసెంబర్‌ 13 ఆదివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

కార్తీకమాసం-13- డిసెంబర్‌- ఆదివారం.

మేషరాశి:జీవిత భాగస్వామి సహకారం పొందుతారు !

ఈరోజు అనుకూల, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ఆఫీస్‌లో మీ పై అధికారుల నుంచి వత్తిడి ఉంటుంది. మీ పిల్లల ద్వారా కొన్ని చెడువార్తలను వింటారు. పెండింగ్‌ పనులు పూర్తికావు. ఈరోజు జీవిత భాగస్వామి సహకారం పొందుతారు.. మీకిష్టమైన వారిని కలుస్తారు దీనివల్ల సంతోషంగా ఉంటారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీసూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.

వృషభరాశి:మానసిక ప్రశాంతత ఉంటుంది !

ఈరాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. ఈరోజు మీరు చేసే పనుల వల్ల మీకు సంతృప్తికరంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. రాజకీయ రంగంలో ప్రయత్నించిన వారికి విజయం అందుతుంది. కొత్త ఒప్పందాల ద్వారా మీ ఖ్యాతి, స్థితి పెరుగుతాయి. మీ పాతస్నేహితుల వల్ల ఇబ్బందులు. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీరామరక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మిథునరాశి:ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు ఏమరపాటుగా ఉంటే విలువైన వాటిని కోల్పోతారు. మీ వస్తువులు జాగ్రత్త. మీ సంతానం పోటీలలో విజయం సాధిస్తారు. శుభకరమైన వార్తలు వింటారు. ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కర్కాటకరాశి:ప్రయాణంలో ఆహ్లాదకరంగా ఉంటుంది !

ఈరోజు ప్రతికూల, మిశ్రమ ఫలితాలు వస్తాయి. దీనికి కారణం గ్రహచలనం. కుటుంబంలో ఇబ్బందులు. ఉపాధికి సంబంధించి పురోగతి ఉంటుంది. పిల్లల బాధ్యతలను మీరు నెరవేరుస్తారు. ఈరోజు ప్రయాణంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. శుభవార్తలు అందుకుంటారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః ఓం శ్రీ గిరి సూర్యనారాయణయనమః అనే మంత్రాన్ని జపించండి.

సింహరాశి:ఆదాయ వనరులు సృష్టించుకుంటారు !

ఈరోజు గ్రహచలనరీత్యా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు  నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. విద్యార్థులకు విజయం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు శత్రువుల వల్ల ఇబ్బందులు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీరామరక్షస్తోత్రం పారాయణం  చేయండి.

కన్యరాశి:ఈరోజు మీకు అదృష్టం కలుగుతుంది !

ఈరోజు మీకు అదృష్టం కలుగుతుంది. ఈరోజు వ్యాపారంలో విజయం సాధిస్తారు. పిల్లల నుంచి సంతృప్తి కరమైన వార్తలను శుభవార్తలు వింటారు. కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం, వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.

పరిహారాలుః శ్రీకృష్ణ ఆరాధన చేయండి.

తులరాశి:మీకు ఆనందం కలుగుగుతుంది !

ఈ రోజు మీకు ఆనందం పెరుగుతుంది. చాలా రోజులుగా కొనసాగుతున్న సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. దీనివల్ల మీకు ఆనందం కలుగుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులందరిలో ఆనందం ఉంటుంది.

పరిహారాలుః శివాష్టకం పారాయణం చేయండి.

వృశ్చికరాశి:అనారోగ్య సమస్యలు వస్తాయి !

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. వీలైతే వైద్యుడిని సంప్రదించండి. విద్యార్థులు శ్రమిస్తేనే ఫలితం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత ఉండక అనేక ఇబ్బందులు పడుతారు. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

ధనస్సురాశి:ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు !

ఈరోజు గ్రహచలనాల రీత్యా ప్రయోజనం ఉంటుంది. భార్య తరుపున వారి నుంచి ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. ఈరోజు కొత్త అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీశివపార్వతీ ఆరాధన చేయండి.

మకరరాశి:ప్రయత్నాలు సఫలమవుతాయి !

ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబ, ఆర్థిక విషయాల్లో విజయం ఉంటుంది. జీవనోపాధి రంగంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. తోటి ఉద్యోగుల నుంచి గౌరవం, మద్ధతు లభిస్తుంది. అనవసర వివాదాల్లో తలదూర్చకండి. అనుకోని అతిథులుగా మీ ఇంటికి వస్తారు. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీశివాభిషేకం చేయండి. ఇష్టదేవతరాధన చేయండి.

కుంభరాశి:తగాదాలకు దూరంగా ఉండండి !

ఈ రోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. అనుకోని పనులు చేయడం వల్ల నష్టం కలిగించవచ్చు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులలో మీపై గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది.

పరిహారాలుః శ్రీగిరి సూర్యనారాయణాయనమః అనే మంత్రాన్ని పారాయణం చేయండి.

మీనరాశి:ఈ రోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి !

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. సంతానం వల్ల మీకు ఆందోళన కలుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశముంది. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ వస్తువులను దొంగిలించే అవకాశముంది. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

 

  • శ్రీ

 

Read more RELATED
Recommended to you

Latest news