డిసెంబర్‌ 21 సోమవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

డిసెంబర్ 21- మార్గశిర మాసం – సోమవారం.

 

 మేష రాశి:ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది !

ఈరోజు అంతా అనుకూలంగా ఉంటుంది. ధన యోగం కలుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు పొందుతారు. విద్యార్థులకు శ్రద్ధ పెట్టి చదువుతారు. దీంతో పోటీ పరీక్షల్లో ఉన్నత మార్కులను పొందుతారు. ఈరోజు మంచి ఆరోగ్యంగా ఉంటారు. స్నేహితుల వల్ల లాభం కలుగుతుంది. ఈరోజు ధన యోగం కలుగుతుంది. ఈరోజు ఏమైనా వస్తువులను క్రయవిక్రయాలు చేస్తారు. ఈరోజు రుణ విమోచన కలుగుతుంది. ఈరోజు అందరితో సఖ్యతగా ఉంటారు .ఇంట్లో ఏదో శుభకార్యాన్ని తలపెడతారు.

పరిహారాలుః ఈరోజు శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ అన్ని చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:శుభవార్త ను అందుకుంటారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఏమైనా వస్తువులను క్రయవిక్రయాలు చేస్తారు. ఈ రోజు విద్యార్థులు విద్య మీద ఆసక్తి పెడుతారు. ఈరోజు ధనాభివృద్ధి కలుగుతుంది. ఈ రోజు కార్య సిద్ధి కలుగుతుంది. ఈరోజు ఏదైనా తీర్థయాత్రలు చేస్తారు. ఇంతకుముందు పోగొట్టుకున్న డబ్బును ఈ రోజు పొందుతారు. దంపతులిద్దరూ మంచి అన్యోన్యంగా ఉంటారు. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు పొందుతారు. ఈ రోజు ఏదో ఒక శుభవార్త ను అందుకుంటారు. ఈరోజు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు అనుకోకుండా ఒక గొప్ప వ్యక్తితో పరిచయం ఏర్పరచుకుంటారు. జీవితంలో మార్పు వస్తుంది. విదేశీ ప్రయాణాలకు ఈ రోజు కలిసి వస్తుంది.

పరిహారాలుః ఈరోజు సుబ్రహ్మణ్యాష్టక పారాయణాన్ని చేసుకోండి.

 

 మిధున రాశి:ఈరోజు ఒక మంచి శుభవార్త వింటారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేసే పనిపట్ల భయం కలుగుతుంది. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజు అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఈరోజు గృహ యోగం కలిగే అవకాశం ఉంది. ఈరోజు ఒక మంచి శుభవార్త వింటారు. ఈరోజు ప్రభుత్వం ద్వారా వచ్చే గృహ యోగాన్ని పండుకుంటారు. ఈరోజు మంచి ఆనందంగా సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు అనుకూల కాలం. ఈరోజు ధన యోగం కలుగుతుంది. ఈరోజు కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

పరిహారాలుః ఈరోజు లింగాష్టకం పారాయణాన్ని చేసుకోండి.

 

కర్కాటక రాశి:ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు అందరితో చక్కగా ఉంటారు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఎవరికైనా మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటారు. ఈరోజు న్యాయవాదులకు అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు పోగొట్టుకున్న ధనాన్ని ఈ రోజు పొందుతారు. ఈ రోజు చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం.

పరిహారాలుః గ్రహదోష నివారణకు ఈరోజు బియ్యము తెల్ల వస్త్రాన్ని పాలు పెరుగు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం గా ఇచ్చుకుంటే మంచిది. దీనితోపాటు ఈరోజు రామరక్షా స్తోత్ర పారాయణ అన్ని చేసుకోండి.

 

సింహరాశి:సంతోషకరమైన వార్తలను వింటారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు సంతోషకరమైన వార్తలను వింటారు. ఈరోజు చేతి నిండా ధనం ఉంటుంది. ఈ రోజు ఎవరికైనా ఏ మాట పైన వాగ్దానం చేస్తే అది నిలబెట్టుకుంటారు. ఈరోజు సోదరులతో సఖ్యత గా ఉంటారు. ఈరోజు విద్యార్థులకు విద్యా లాభం కలుగుతుంది. విద్య మీద శ్రద్ధ వహిస్తారు. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

పరిహారాలుః ఈరోజు గణేశ స్తోత్రం పారాయణాన్ని చేసుకోండి.

 

కన్యారాశి:ధన లాభం కలుగుతుంది !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు పట్టిందల్లా బంగారంగా ఉంటారు. ఈ రోజు ధన లాభం కలుగుతుంది. ఈరోజు జన వశీకరణ అవుతారు. శత్రువులకు దూరంగా ఉంటారు. ఈ రోజు అనుకున్న కార్యక్రమాన్ని అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఈరోజు పెద్ద వారిని గౌరవిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉంటారు. పెద్ద వారి మాటలను సూచనలను గౌరవిస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు .తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు అన్ని రకాల పనులలో విజయమే లక్ష్యంగా చెప్పబడుతుంది.

పరిహారాలుః ఈరోజు గోవింద నామ పారాయణం చేసుకోండి శుభఫలితాలు వస్తాయి.

 

 తులారాశి:కొత్త వ్యక్తులతో పరిచయం !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఈరోజు ఎదుటి వారిని బట్టి నడుచుకోవడం మంచిది. సోదరులతో సఖ్యత గా ఉండండి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకుంటారు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహిస్తారు. ఇంతకుముందు పోగొట్టుకున్న ధనాన్ని ఈ రోజు అందుకుంటారు. ఈరోజు యజ్ఞయాగాది క్రతువులలో పాలుపంచుకుంటారు. ఈరోజు మంచి సంతోషంగా ఉంటారు.

పరిహారాలుః ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి మంచి జరుగుతుంది.

 

 వృశ్చిక రాశి:ఈరోజు ధన యోగం కలుగుతుంది !

ఈరోజు మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు స్నేహితుల వల్ల లాభం పొందుతారు. ఈరోజు ధన యోగం కలుగుతుంది. సమస్త కార్య సిద్ధి పొందుతారు. విదేశాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఈరోజు శత్రునాశనం కలుగుతుంది. ఈ రోజు పెద్ద వారి  మాటలను, సూచనలను గౌరవిస్తారు. ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే మీకు అనుకూలంగా ఉంటాయి. అందరితో మంచి సఖ్యతతో వ్యవహరిస్తారు.

పరిహారాలుః ఈరోజు శ్రీకనకధారా స్తోత్ర పారాయణ అన్ని చేసుకోండి.

 

 ధనస్సురాశి:శుభ యోగం కలుగుతుంది !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు గంభీరమైన శుభ యోగం కలుగుతుంది. ఈరోజు శత్రువులను ఎలా ఎదుర్కోవాలో బాగా ఆలోచిస్తారు. ఈరోజు వివాహా నిశ్చయతాంబూలాలకు అనుకూలంగా ఉంది. ఈరోజు మీ పిల్లల విషయంలో ఒక శుభవార్త వింటారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలం. ఈరోజు మంచి ఆరోగ్యంగా ఉంటారు. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల నుంచి గౌరవాన్ని పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మాతృ, పితృ సౌఖ్యం పొందుతారు. ఈరోజు స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. ఈరోజు వాహనాలను బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు శ్రీగణేశ పంచరత్న స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి:పేదవారికి సహాయం చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ మాట పలుకుబడి చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది తాత్కాలిక ప్రైవేటు ఉద్యోగం చేసేవారు పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు తక్కువగా మాట్లాడుతూ అన్నింటిని సాధిస్తారు. ఈరోజు దైవ చింతన చేస్తారు. ఈరోజు దేవాలయ నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. పేదవారికి సహాయం చేస్తారు. ఈరోజు వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈరోజు మీ గృహంలో ఏదైనా వేదిక జరిపించే అవకాశం ఉంది. ఈ రోజు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. లాభం కలిసి వస్తుంది.

పరిహారాలుః ఈరోజు శ్రీదక్షిణామూర్తి స్తోత్రం పారాయణ అన్ని విధాల మంచి చేస్తుంది.

 

కుంభరాశి:స్వయం కృషి తో ఎదుగుతారు !

ఈరోజు మంచి అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసినా చక్కగా నేర్పుగా చేస్తారు. ఈరోజు స్వయం కృషి తో ఎదుగుతారు. ఈ రోజు ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు విద్య మీద మంచి శ్రద్ధ వహిస్తారు. ఉన్నత ఫలితాలను పొందుతారు. విదేశాల్లో వ్యాపార లాభం పొందుతారు. ఈరోజు ఆధ్యాత్మిక చింతన చేస్తారు. ఈరోజు గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. పెద్ద వారి సూచనలను పాటిస్తారు. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ పారాయణ చేసుకోండి.

 

 మీన రాశి:కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే తొందరగా అవ్వాల్సిన పని కొంచెం నెమ్మదిగా అవుతుంది. మీకు వచ్చే మంచి అవకాశాలు కష్తతరంగా ఉంటాయి. ఈరోజు చంద్రు దృష్టి పరివర్తన వల్ల పనులు నెమ్మదిగా సాగే అవకాశం ఉంది. సోదరీ సోదరుల మధ్య వివాదాలు వచ్చినట్టే వచ్చి మళ్ళీ కలిసిపోతారు. విద్యార్థులు ఈ రోజు విద్య మీద శ్రద్ధ వహిస్తారు. ఈరోజు గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఈరోజు మంచి సంతోషంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు శ్రీలక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news