డిసెంబర్‌ 22 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

డిసెంబర్ – 22 – మార్గశిర మాసం –  మంగళవారం.

 మేష రాశి:ఆర్థిక లాభం కలుగుతుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటే మంచిది. స్నేహితులతో సఖ్యత గా ఉండండి. సమయాన్ని వృధా చేసుకోకుండా పనులను చేసుకుంటే ఆర్థిక లాభం కలుగుతుంది. ఈరోజు చెప్పుడు మాటలు వినకుండా ఉండడం మంచిది. ఈరోజు అనవసరమైన వాగ్దానాలు చేయకుండా ఉండటం మంచిది.

పరిహారాలుః ఈరోజు లింగాష్టక పారాయణాన్ని చేసుకోండి .

 

todays horoscope

వృషభ రాశి:ఈరోజు ఏ పని చేసినా కలిసి వస్తుంది !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ధన లాభం కలుగుతుంది. ఈరోజు సంతోషంగా ఉంటారు. ఈరోజు సోదరులతో సఖ్యత గా ఉంటారు. ఈరోజు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. అన్నిరకాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఈరోజు ప్రతి పనిని ఉత్సాహంగా చేసుకుంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు.

పరిహారాలుః ఈరోజు సుబ్రహ్మణ్యాష్టక పారాయణాన్ని చేసుకోండి.

 

మిధున రాశి:ఈరోజు ఋణ విమోచనం కలుగుతుంది !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఈరోజు ఋణ విమోచనం కలుగుతుంది. ఈరోజు ధన లాభం కలుగుతుంది. ఈరోజు వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. ఈరోజు ధనాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు వేడుకల్లో పాల్గొంటారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలం.

పరిహారాలుః ఈరోజు రామరక్షా స్తోత్ర పారాయణ చేసుకోండి .

 

 కర్కాటక రాశి:వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు మీ తొందరపాటు తనాన్ని అదుపులో ఉంచుకోండి. ఈరోజు తక్కువ మాట్లాడటం మంచిది. అనుకున్న సమయంలో పనులను పూర్తి చేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు చేసే పని మీద శ్రద్ధ పెట్టి చేయండి. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సమయానికి పనులు పూర్తి చేసుకోవడం మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు సంబంధం లేని పనులకు దూరంగా ఉండటం మంచిది. వాదోపవాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. ఈరోజు దైవనామస్మరణ చేసుకోం.డి వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త.

పరిహారాలుః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి .

 

సింహరాశి:ఈరోజు ధన నష్టం కలిగే అవకాశం !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఎవరిని తొందరగా నమ్మకండి. ఈరోజు స్వయంకృతాపరాధం కలిగే అవకాశం ఉంది జాగ్రత్త. ఈరోజు ఎవరు మీకు సహాయం చేస్తారో వారిని దూరం పెట్టకండి. ఈరోజు ధన నష్టం కలిగే అవకాశం ఉంది. ఈరోజు వాహన ప్రయాణాలు జాగ్రత్త. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈరోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది, అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. ఈరోజు కొంచెం నిరుత్సాహంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకండి ,చేయకండి.

పరిహారాలుః ఈరోజు సుందరాకాండ పారాయణ చేసుకోండి.

 

కన్యారాశి:ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. ఈరోజు ఆనందకరంగా, సంతోషంగా ఉంటారు. ఈరోజు ధన యోగం కలుగుతుంది. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగం చేసేవారు పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉంటారు. ఈరోజు మీ పిల్లలకి పేరుప్రఖ్యాతులు రావడం వల్ల కుటుంబ గౌరవం పెరుగుతుంది, వంశ గౌరవం పెరుగుతుంది. ఈరోజు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈరోజు అన్ని వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

పరిహారాలుః ఈరోజు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేసుకోండి .

 

 తులారాశి:ఈరోజు ఆర్థిక లాభం పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభం పొందుతారు. ఈరోజు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వివాహాది నిశ్చయ తాంబూలాలు తీసుకుంటారు. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు ప్రతి పనిలో ఆనందాన్ని పొందుతారు, ఆదరణ పొందుతారు.

పరిహారాలుః ఈరోజు లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి.

 

 వృశ్చిక రాశి:ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ విషయంలోనైనా కంగారు పడతారు. ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది . ఈరోజు విద్యార్థులు విద్య మీదనే శ్రద్ధ వహించి పోటీపరీక్షల్లో ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత తెచ్చుకోండి. ఈరోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు సోదరులతో సఖ్యత గా ఉండండి. ఈరోజు మీ కోపాన్ని అహంకారాన్ని అదుపులో ఉంచుకుంటే మంచే జరుగుతుంది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు శుభ సమయం గా చెప్పబడుతోంది.

పరిహారాలుః ఈరోజు దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి అంతా శుభప్రదంగా ఉంటుంది.

 

 ధనస్సు రాశి:ఈరోజు వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు అనవసరపు విషయాలను కుటుంబంలో చర్చించకుండా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో వాదోప వాదాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. ఈరోజు మీరు ఇతరుల వస్తువులను అంటే వాహనాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ధన నష్టం కలిగే అవకాశం ఉంది. ఈరోజు వ్యసనానికి దూరంగా ఉండండి. ఈరోజు పెద్దవారి సూచనలను పాటించండి.

పరిహారాలుః ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి.

 

 మకర రాశి:ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు అద్భుతాలను సృష్టించే అవకాశం ఉంది. ఈరోజు తెలుగు వారు ఇతర దేశాల్లో ఉన్న వారికి ఉన్నత పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. ఈరోజు దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు ఉద్యోగగులకు అనుకూలంగా ఉంటుంది, ప్రమోషన్లు కలిగే అవకాశం ఉంది. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించి పరీక్షలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణతను పొందుతారు. ఈరోజు వివాదాస్పద విషయాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు ధన లాభం కలుగుతుంది. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు నూతన వాహన యోగం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 కుంభరాశి:ఈరోజు ధన యోగం కలుగుతుంది !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది.  ఈరోజు మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు ధన యోగం కలుగుతుంది. అన్నిరకాల వ్యాపారస్తులకు బాగుంటుంది. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజంతా సంతోషంగా ఉంటారు. ఈరోజు ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు శ్రద్ధ వహించి ఉన్నత ఉత్తీర్ణత పొందుతారు. ఈరోజు రుణాలను తీర్చుకుంటారు. ఈరోజు నూతన వస్తు, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

పరిహారాలుః ఈరోజు శ్రీ వెంకటేశ్వర గోవింద నామాలు పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:ఈరోజు తీర్థయాత్రలు చేసే అవకాశం !

ఈరోజంతా సంతోషంగా ఉంటారు. సోదరులతో కలిసి మెలిసి ఉంటారు. ఈరోజు శత్రునాశనం కలుగుతుంది. ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం పొందుతారు. ఉన్నత ఉత్తీర్ణత పొందుతారు. ఈరోజు మీ బంధువుల కలయిక మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఈరోజు ఎవరికైనా మీరు మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈరోజు చేసిన తప్పులకు పశ్చాత్తాపం పొందుతారు.

పరిహారాలుః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ చేసుకోండి.

 

  • శ్రీ

 

Read more RELATED
Recommended to you

Latest news