దిగొస్తున్న బంగారం ధ‌ర‌లు

-

బంగారం ధ‌రలు‌ దిగొస్తున్నాయి. తులం ప‌సి‌డి వెయ్య రూపాయ‌ల వ‌ర‌కు త‌గ్గింది. దీంతోపాటు వెండి ధ‌ర‌లూ ప‌డిపోతున్నాయి. దేశ రాజ‌ధాని న్యూ ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛ‌‌త క‌లిగిన తులం బంగారం ధ‌ర మంగ‌ళ‌వారం ఒకే రోజు రూ.1,050 త‌గ్గి రూ.49వేల‌కు దిగువ‌కు 48,560కి చేరింది. డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బ‌ల‌ప‌డడం, అంత‌ర్జాతీయ మార్కెట్‌లో అతి విలువైన లోహాల ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డుతుండ‌డంతో దేశీయంగా ధ‌ర‌లు దిగొచ్చిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఇక అంత‌కుముందు రూ.60,890గా ఉన్న కిలో వెండి ధ‌ర పారిశ్రామిక దారులు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవ‌డంతో ఏకంగా రూ.1590 త‌గ్గి, రూ. 59,300ల‌కు చేరింది.

 

ఇక హైద‌రాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ.980కి త‌గ్గి , రూ.50,400ల‌కు చేరింది. అంత‌కు ముందు తులం బంగారం ధ‌ర 51,380గా ఉన్న‌ది. 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర కూడా రూ.900 త‌గ్గి, రూ. 49,200ల‌కు ప‌డిపోయింది. త్వ‌ర‌లో క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతు‌డంతోపాటు అమెరికా ప్రెసిండెంట్ బైడెన్ వైట్‌హౌజ్‌లోకి అడుగు పెట్టే ముహూర్తం ద‌గ్గ‌ర ‌ప‌డుతుండ‌డంతో ఒక్క‌సారిగా ప‌సిడి ధ‌ర‌లు దిగొచ్చాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news