మహిళలతో పాటు పురుషులకు సమాన హక్కులు ఉండాలంటూ దీక్ష చేయడం కోసం మగవారి హక్కుల కోసం పోరాటం చేసే కార్యకర్తలు విశాఖ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా వారు రైల్వే స్టేషన్ లో ప్లెక్సీ ని ప్రదర్శిస్తూ స్లోగన్స్ వినిపించారు. స్త్రీల కోసం కమిపన్ ఉన్నట్టే పురుషుల కోసం మెన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్స చేపడుతున్నట్టు ప్రకటించారు. మగవారి హక్కుల కోసం ఢిల్లీలో సత్యాగ్రహం అంటూ ప్లెక్సీ ని ప్రదర్శించారు.
సేవ్ ఇండియన్ ఫ్యామిలీ మూమెంట్ ఆధ్వర్యంలో ఈ దీక్ష చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య మగవారి పై సైతం దారుణాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. మగవారిని ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఘటనలు తరుచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రత్యేకంగా ఎలాంటి చట్టాలు లేకపోవడంతో వారికి అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కారణం లేకున్నా కొందరూ భార్యలు భర్తలపై గృహ హింసలాంటి కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్న ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి.