నూతన చట్టాలను రద్దు చేయాలనే భాగంలో గణతంత్ర దినోత్సం రోజు ఎర్రకోట వద్ద దారి తీసిన ఉద్రిక్త పరిస్థితులకు కీలకపాత్ర పోషించాడంటూ ఆరోపణలు ఎదుర్కుంటూ.. నాటి నుంచి అదృశ్యమైన పంజాజీ నటుడు దీప్ సిద్ధూను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు, చండీఘట్ అంబాల మధ్యనున్న జిరాక్‌పుర్ సమీపంలో దీప్‌సిద్ధూను అరెస్ట్ చేసినట్లు డిప్యూటీ కమిషనర సంజీవ్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడని..
నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ గత కొన్ని నేలలుగా రైతులు దిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్నారు. అందులో భాగంగా జనవరి 26న ఎర్రకోట వద్ద నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ట్రాక్టర్ ర్యాలీ ఘటన ఉద్రిక్తంగా మారడానికి పంజాబీ నటుడు దీప్‌సిద్ధూ కారణమని.. అతనే రైతులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశాడని రైతు సంఘాలు ఆరోపించాయి. శాంతియుతంగా ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించే రైతులను రెచ్చగొట్టి ఎర్రకోటవైపు వెళ్లేలా చేశాడని.. ఎర్రకోటపై ఓ మతానికి సంబంధించిన జెండాలు ఎగరవేసే క్రమంలో సిద్ధూ అక్కడే ఉండి జెండాలు ఎగరవేయడాన్ని మద్దతిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టాడని రైతు సంఘాలు పేర్కొన్నాయి. అప్పుటి నుంచి దీప్‌సిద్ధూ కనిపించకుండా పోవడంతో, ఆయన ఆచూకీ చెప్పినవారికి రూ.లక్ష రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించిన సంగతి విదితమే.
కాలిఫోర్నియా నుంచి..
అప్పటి నుంచి అదృశ్యంలో ఉన్న దీప్‌సిద్ధూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు, వీడియోలు అప్‌లోడ్ చేస్తునే ఉన్నాడు. విదేశాల్లో ఉన్న సిద్ధూ స్నేహితురాలు ఆ వీడియోలు పోస్ట్ చేస్తున్నట్లు సమాచారం. దీప్‌సిద్ధూ వీడియోలు చేసి పంపిస్తే కాలిఫోర్నియాలో ఉండే అతని స్నేహితురాలి వాటిని సోషల్ మీడియాలో పెడుతున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు.