మీ దగ్గర ఏదైనా స్టార్టప్ ఐడియా ఉందా ? స్టార్టప్‌ను ప్రారంభించడం ద్వారా చక్కని ఎంటర్‌ప్రిన్యూర్‌గా ఎదగాలనుకుంటున్నారా ? అయితే ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ మీకు సదవకాశాన్ని అందిస్తోంది. ఆ బ్యాంకు మీ స్టార్టప్‌కు కావల్సిన నిధులను అందిస్తుంది. అవును.. సామాజికంగా ప్రభావం చూపించే స్టార్టప్‌లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పెట్టుబడులు పెట్టాలని అనుకుంటోంది. అందులో భాగంగానే ఈ అవకాశాన్ని అందిస్తోంది.
మీ దగ్గర ఏదైనా స్టార్టప్ ఐడియా ఉంటే.. దాని వల్ల సమాజంపై ప్రభావం బాగా పడుతుంది.. అనుకుంటే ఆ ఐడియాను మీరు స్టార్టప్‌గా మార్చుకోవచ్చు. అందుకు హెచ్‌డీఎఫ్‌సీ సహాయం చేస్తుంది. అందుకు మీరు చేయవలసిందల్లా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవడమే. ఈ క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీతో పనిచేసే పలు స్టార్టప్ ఇంకుబేటర్లు మీ ఐడియాను రివ్యూ చేస్తాయి. నచ్చితే మీకు వెంటనే నిధులను అందజేస్తారు.
కాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇందుకు గాను దేశంలో మొత్తం 9 ఇంకుబేటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీ ఢిల్లీ, భూటాన్, ఏఐసీ బీఐఎంటెక్ నోయిడా, ఐఐఎం కాశీపూర్, జీయూఎస్ఈసీ గుజరాత్, సి-క్యాంప్ బెంగళూరు, బనస్థలి యూనివర్సిటీ జైపూర్, విల్‌గ్రో ఇంకుబేషన్ చెన్నై, టి హబ్ హైదరాబాద్‌లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో కలసి పనిచేస్తాయి. ఔత్సాహికులకు చెందిన స్టార్టప్ ఐడియాలను సదరు ఇంకుబేటర్‌లు పరిశీలిస్తాయి. ఈక్రమంలో ఓకే అయితే స్టార్టప్ నిర్వాహకులకు బ్యాంక్ నిధులను అందజేస్తుంది. మరింకెందుకాలస్యం.. మీ దగ్గర కూడా చక్కని ఐడియా ఉంటే.. దాన్ని స్టార్టప్‌గా మార్చాలంటే.. వెంటనే దరఖాస్తు చేసుకోండి మరి..!