‘కరోనా’నా డోంట్ కేర్.. అంబరాన్నంటిన దీపావళి సంబరాలు

-

కరోనా కబలిస్తున్న వేళ ప్రజలు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ప్రతి ఏటా జరుపుకున్నట్టే దీపావళిని గ్రాండ్ గా జరుపుకున్నారు. ఇక ఈ టపాసుల దెబ్బకు వాయు కాలుష్యం మరింత పెరిగినట్టు చెప్పచ్చు. పెద్దపెద్ద నగరరాల్లో వాయు కాలుష్యం ఇప్పటికే ఎక్కువ అని భావించి చాలా రాష్ట్రాల్లో బాణాసంచా అమ్మకాలు, వినియోగం మీద నిషేదం విధించారు. సూప్రీం కోర్టు కూడా 2 గంటలపాటు టపాసులు పేల్చుకోవచ్చని ఆదేశాలిచ్చింది. అయితే ఇలాంటి విషయాల్లో చెప్పిన మాట వింటారా ? సాయంత్రానికి అన్ని రాష్ట్రాల్లో రోడ్డెక్కారు.

ప్రతి ఏడాది లానే చెప్పాలంటే అంత కన్నా ఎక్కువగానే దీపావళి సంబరాలు జరుపుకున్నారు. దేశ రాజధాని అయిన ఢిల్లీలో నవంబర్‌ 7 నుంచి 30వ తేదీ వరకు బాణా సంచాపై నిషేధం విధించారు. పండగ పూట మంత్రాలను పఠిద్దామని ప్రసారమాధ్యమాల్లో వీక్షించి పూజల్లో పాల్గొనాలని సీఎం కేజ్రీవాల్ కోరినా పలుచోట్ల ప్రజలు నిబంధనలు ఉల్లంఘించడంతో నిన్న ఒక్కరోజే 80 మంది అరెస్ట్‌ అయ్యారు. బాణసంచా విక్రయించిన 55 మందిని అరెస్టు చేసిన పోలీసులు, టపాసులు పేల్చిన వారిలో ఇప్పటి వరకు 21 మందిని అరెస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news