ఆస్కార్ వేదిక పై నాటు నాటు పాటను అద్భుతంగా పరిచయం చేసిన దీపికా పడుకునే..!

-

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో.. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా ఘనవిజయం సాధించి అంతర్జాతీయ స్థాయిలో నటీనటులకు పేరు తీసుకొచ్చింది. అంతే కాదు ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకొని.. 130 కోట్ల మంది భారతీయులు గర్వించేలా చేసింది. ఇదిలా ఉండగా ఆస్కార్ అవార్డ్స్ వేడుకలలో ప్రెసెంట్ గా పాల్గొన్న బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే ఇప్పుడు ప్రశంసల వర్షం అందుకుంటోంది.

ఆమె ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటను చాలా అద్భుతంగా పరిచయం చేశారు. నాటు నాటు సాంగ్ ఒక ముఖ్యమైన సన్నివేశంలో వచ్చిందని ఈ సినిమా స్నేహం ఆధారంగా ముఖ్యంగా ఇద్దరు రియల్ లైఫ్ వ్యక్తులు.. విప్లవ వీరులు.. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ మధ్య నడిచిందని ఈ పాట వలసవాద వ్యతిరేక ఉద్యమానికి నాందిగా ఉర్రూతలూగించిన ఈ పాట ఎప్పటికీ ఎవర్గ్రీన్ అనే చెప్పాలి.

ఈ పాటకి ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో ప్రేక్షకులు లేచి మరీ డాన్స్ చేశారు. అలాగే ఇది మొదటి ఇండియన్ ప్రొడక్షన్ కంపెనీ నుండి ఆస్కార్ కి నామినేట్ అయిన మొదటి పాట అని.. నాటు అంటే మీకు తెలుసు.. ఒకవేళ మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా నుండి నాటు నాటు పాట చూస్తూ వింటారు అని చెప్పడంతో ఆస్కార్ హాల్ మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోతుంది.ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దీపిక పదుకొనె పై ట్విట్టర్ ద్వారా ప్రశంశలు అందుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news