డిగ్రీ పట్టా కాగితం ముక్క మాత్రమే.. ఐఏఎస్ అధికారి సంచలన వ్యాఖ్యలు

-

పశ్చిమబెంగాల్: కరోనా కారణంగా అన్ని కాలేజీలు, స్కూళ్లు మాతపడ్డాయి. ఇటీవల కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు పున:ప్రారంభించేందుకు రెడీ అయ్యాయి. అయితే ఆయా రాష్ట్రాల్లో క్లాసులు ఆన్ లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో అధికారులు ఆన్ లైన్ క్లాసుల నిర్వహణపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. అంతేకాదు విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుంది.

ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారి జితిన్ యాదవ్ సోషల్ మీడియాలో విద్యార్థులతో చిట్ చిట్ నిర్వహించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన డిగ్రీ పట్టాలపై సంచలన కామెంట్స్ చేశారు. డిగ్రీ పట్టా ఒక కాగితం ముక్క మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థుల ప్రవర్తనే వారికి పెద్ద పట్టా అని చెప్పారు. విద్యార్థుల్లో ఉండే నీతి, నిజాయితీ, పోరాటాలు, అనుభవాలు మాత్రమే నిజమైన డిగ్రీ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నీతి, నిజాయితీ బతకాలని సూచించారు. దీంతో జితిన్ యాదవ్‌పై విద్యార్థులు ప్రశంసలు కురిపించారు. చాలా బాగా చెప్పారని అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news