జాతీయ వైద్యుల దినోత్సవం 2021: భారతదేశ‌ మొదటి మహిళా డాక్టర్ గురించి తెలుసుకోండి

-

డాక్టర్స్ డే.. దేశ వ్యాప్తంగా ప్రతీ ఏడాది జులై 1వ తేదీన డాక్టర్స్ డే జరుపుకుంటారు. కరోనా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం అందిస్తున్న డాక్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ భారతదేశ మొట్ట మొదటి మహిళా డాక్టర్ First Female Doctor గురించి తెలుసుకుందాం.

మొదటి మహిళా డాక్టర్/ First Female Doctor
మొదటి మహిళా డాక్టర్/ First Female Doctor

1865 సంవత్సరంలో మహారాష్ట్ర థానే జిల్లాలో జన్మించిన ఆనందిబాయ్ గోపాల్ భారతదేశ మొదటి మహిళా డాక్టర్ గా పేరు తెచ్చుకుంది. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆనంది బాయ్ వివాహం 9 సంవత్సరాల వయసులో గోపాల్ రావ్ జోషితో జరిగింది. పెళ్ళయ్యే వరకు ఆనంది బాయ్ చదువుకోలేదు. పెళ్ళయ్యాక చదువుకుంటానని మాట తీసుకున్న తర్వాతే 25సంవత్సరాల గోపాల్ రావ్ జోషి పెళ్ళి చేసుకున్నాడు.

అప్పట్లో మహిళలను చదివించడం సమంజసం కాదని భావించేవారు. పెళ్ళయ్యాక కూడా ఆనంది బాయ్ కి చదువు మీద ఇష్టం పెరగలేదు. కానీ, గోపాల్‌రావ్ చొరవతో మెల్లగా చదువుకు అలవాటు పడింది. 14సంవత్సరాల వయసులో ఆనంది బాయి తన 10రోజుల కొడుకును కోల్పోయింది. ఆ సమయంలో వైద్యుల ఆవశ్యకత ఆనంది బాయికి బాగా అర్థం అయింది. ఆ తర్వాత నుండి చదువు మీద దృష్టి నిలిపిన ఆనందిబాయి పెన్శిల్వేనియాలోని మెడికల్ కాలేజీకి అప్లై చేసింది. అప్పుడు చాలామంది ఆమెను విమర్శించారు. మహిళలకు చదువులు అవసరమా, అది కూడా విదేశాలకు వెళ్ళడం ఏంటని విమర్శలు వచ్చాయి. కానీ, గోపాల్ రావ్ జోషి మాత్రం వాటిని పట్టించుకోలేదు.

ఆనంది బాయ్ 22 సంవత్సరాలు ఉన్న సమయంలో న్యూయార్క్ ఓడ ఎక్కించాడు. అప్పటికే ఆనందిబాయ్ కి దేశవ్యాప్తంగా మహిళా డాక్టర్ గా గుర్తింపు వచ్చింది. రెండు సంవత్సరాల తరువాత ఆనందిబాయ్ ఇండియాకి వచ్చింది. అప్పుడు అదిరిపోయే స్వాగతాన్ని అందించారు. ఆ తర్వాత కొల్హాపూర్ లోని ఎడ్వర్డ్ హాస్పిటల్ లో మెడికల్‌ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహించింది.

Read more RELATED
Recommended to you

Latest news