ప్రస్తుత తరుణంలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల మనకు తెలియని ప్రదేశాల్లో ఉన్నప్పుడు రూట్ కనుక్కోవడం తేలికవుతోంది. గూగుల్ మ్యాప్స్‌తో ఎంత సుదీర్ఘ సమయమైనా, దూరమైనా వాహనాల్లో ప్రయాణించడం సులభతరం అయింది.
అయితే మనం రోజూ ఎక్కడ తిరిగేదీ మ్యాప్స్‌లో ఆటోమేటిక్ గా సమాచారం సేవ్ అవుతుంది. కానీ దాన్ని మనం డిలీట్ చేయవచ్చు. అందుకు కింద తెలిపిన సూచనలు పాటించాలి.
గూగుల్ మ్యాప్స్‌లో 3 నెలలు, 18 నెలలు, 36 నెలల కన్నా పాతదైన లొకేషన్ హిస్టరీని ఆటోమేటిగ్గా డిలీట్ చేయవచ్చు. అందుకు గాను ఈ స్టెప్స్‌ను అనుసరించాలి.
1. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయండి.
2. మీ ప్రొఫైల్ పిక్చర్ లేదా అకౌంట్ సర్కిల్ మీద ట్యాప్ చేయండి. తరువాత టైమ్ లైమ్ మీద ట్యాప్ చేయండి.
3. కుడి వైపు పై భాగంలో మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై ట్యాప్ చేయాలి. తరువాత సెట్టింగ్స్‌లో ఉండే ప్రైవసీ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
4. కిందకు స్క్రోల్ చేసి లొకేషన్ సెట్టింగ్స్ కు వెళ్లాలి.
5. ఆటోమేటికల్లీ డిలీట్ లొకేషన్ హిస్టరీ పై ట్యాప్ చేయాలి.
6. చివరకు స్క్రీన్ మీద వచ్చే సూచనలను పాటించాలి.
గూగుల్ మ్యాప్స్‌లో మీరు లొకేషన్ హిస్టరీని ఆన్ చేస్తే మీ లొకేషన్ వివరాలను గూగుల్ నమోదు చేస్తుంటుంది. అవన్నీ మీ గూగుల్ అకౌంట్‌లో స్టోర్ అవుతాయి. గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ హిస్టరీని ఆన్ చేయవచ్చు. లేదా పాజ్ చేయవచ్చు. అందుకు గాను కింద ఇచ్చిన స్టెప్స్‌ను పాటించాలి.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో మ్యాప్స్‌లో ఉండే టైమ్‌లోకి వెళ్లి అక్కడ సెట్టింగ్స్‌లోని లొకేషన్ హిస్టరీలో దాన్ని ఎనేబుల్ చేసే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. లేదా దాన్ని పాజ్ కూడా చేయవచ్చు. ఈ విధంగా గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ హిస్టరీని ఉపయోగించుకోవచ్చు.