ఏపీ డీజీపీ.. రాంగోపాల్ వర్మనే మించిపోయాడు : చింతమనేని

-

అమరావతి : పోలీసులతో తనకు ప్రాణహానీ ఉందని.. తనకు సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. తన పై అక్రమ కేసులు పెట్టడమే ఫ్రెండ్లీ పోలీసింగా.. అక్రమ కేసుల సినిమా చూపించటంలో రాంగోపాల్ వర్మను.. ఏపీ డీజీపీ మించిపోయారని చురకలు అంటించారు. రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లు ఎందరో ఉండగా మీడియా సమావేశంలో తన పేరే డీజీపీ ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించారు.

6093 ఆర్థిక నేరగాడి గురించి ప్రజలకు తెలిపే ప్రయత్నం ఎందుకు చేయలేదని.. తన పై ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెదేపా క్యాడర్ ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు తనను బంతిలా వాడుకుంటున్నారన్నారు. ఓ ఎస్పీ చింతమనేనిపై కేసులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ 1+1 ఆఫర్లు ప్రకటించారని.. తన తప్పుంటే ఉరిశిక్షకైనా సిద్ధమే, కేసులు తొలగించమని దేహీ అని ఎవర్నీ అడగలేదని పేర్కొన్నారు.తాను వనజాక్షి సమీపంలో కూడా లేనని ఆమె ఫిర్యాదులో పేర్కొంటే, అసెంబ్లీలో జగన్ రెడ్డి చెప్పిన కట్టుకథల్ని డీజీపీ వినిపించారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news