4 అసెంబ్లీ స్థానాలకు ఉప-ఎన్నికల షెడ్యూల్ విడుదల

మన దేశంలో ని 4 అసెంబ్లీ స్థానాలకు ఉప-ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. పశ్చిమ బెంగాల్‌ లో 3, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానానికి షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. పశ్చిమ బెంగాల్‌ లో ని భవానీపూర్, శంషేర్‌గంజ్, జంగీపూర్ నియోజకవర్గాలు మరియు ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

ఇక ఈ 4 అసెంబ్లీ స్థానాలకు ఉప-ఎన్నిక సెప్టెంబర్ 30న జరుగనుంది. అలాగే అక్టోబర్ 3న కౌంటింగ్ జరుగనుండగా ఈ ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 6 న వెలువడనుంది. అంతేకాదు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 13 గా నిర్ణయించింది. అయితే పశ్చిమ బెంగాల్‌ లో మూడు నియోజక వర్గాలలోని.. ఓ నియోజక వర్గం లో సిఎం మమతా బెనర్జీ పోటీ చేయనున్నారు. కాగా కరోనా నేపథ్యం లో  హుజరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక తో పాటు మరో మూడు పార్లమెంటరీ నియోజక వర్గాల్లోనూ ఉప ఎన్నికలను వాయిదా వేసింది కేంద్ర ఎన్నికల సంఘం.