ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో ఏయిర్ క్వాలిటీ..

-

ఢిల్లోలో ప్రజలు శ్వాసించని రీతిలో వాయు కాలుష్యం పెరగింది. ఏయిర్ క్వాలిటీ ప్రమాదకర రీతిలో పెరిగింది. దీపావళి కారణంగా వాతావరణంలో గాలి నాణ్యత దెబ్బతింది. దీపావళి పండగ అనంతరం శుక్రవారం రోజున దేశ రాజధానిలో పలు ప్రాంతాల్లో ఇదే విధంగా వాయు నాణ్యత దెబ్బతింది. పోల్యూషన్ మీటర్( 2.5)లో గాలినాణ్యత 655.07 గా నమోదైంది. మందపాటి పొగ ఢిల్లీని కమ్మేసింది. ఇప్పటికే కొందరు ప్రజలు గోంతులో మంట, కళ్ల నుంచి నీరు కారడం వంటి లక్షణాలతో ఫిర్యాదు అందినట్లు అధికారులు తెలుపుతున్నారు.

ఇప్పటికే పంటలను కాల్చడం వల్ల ఢిల్లీలో ఏయిర్ క్వాలిటీ దెబ్బతింది. దీంతో పాటు గురువారం ఢిల్లీ వ్యాప్తంగా పండగ సందర్భంగా విపరీతంగా క్రాకర్స్ ను కాల్చారు. దీంతో ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్ ( AQI) 500 లను దాటి ’ వెరీపూర్‘ కేటగిరీలోకి వెళ్లిందని సిస్టమ్ ఫర్ ఏయిర్ క్వాలిటీ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రిసెర్ఛ్(SAFAR) వెల్లడించింది. నవంబర్ 7వరకు ఢిల్లీలో ఇదే పరిస్థితి నెలకొంటుందని సఫర్ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news