హ‌మ్మ‌య్య ! ఈ రోజు బంగారం ధ‌ర‌లు పెర‌గ‌లేదు

ఈ మ‌ధ్య కాలంలో బంగారం ధ‌రల‌కు రెక్క‌లు వ‌స్తున్నాయి. సామ‌న్యులు అందుకొని విధంగా బంగారం ధ‌ర‌లు పెరుగుతున్నాయి. అయితే ఈ రోజు బంగారం గురించి ఒక గుడ్ న్యూస్ వ‌చ్చిన‌ట్టే. ఈ రోజు బంగారం ధ‌ర‌ల పై ఎలాంటి మార్పు లేదు. అంటే ఒక రూపాయి కూడా ఈ రోజు పెర‌గ‌లేదు. ఈ రోజ మ‌న హైద‌రాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల‌ బంగారం ధ‌ర రూ. 44,550 ఉండ‌గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,600 గా ఉంది.

 

అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ లోని విజ‌య‌వాడ‌, విశాఖ ప‌ట్నంల‌లో బంగారం ధ‌ర ఒకే విధంగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధ‌ర రూ. 44,550 గా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధ‌ర 48,600 గా ఉంది. అలాగే దేశ రాజ‌ధాని ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,700 గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర 50,900 గా ఉంది.

అలాగే ఆర్థిక రాజ‌ధాని ముంబాయి న‌గ‌రం లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44, 470 , 24 క్యారెట్ల 10 గ్రాముల‌కు 47,410 గా ఉంది. అలాగే కోల్ క‌త్త లో 22 క్యారెట్ల 10 గ్రాముల‌కు రూ. 47,850, 24 క్యారెట్ల 10 గ్రాముల‌కు 50,550 గా ఉంది. అలాగే బెంగ‌ళూర్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల‌కు రూ. 44,550 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల‌కు రూ.48,600 గా ఉంది.