ఢిల్లీలోని సుభాష్ నగర్ కు చెందిన రాజన్ అనే తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఎలక్ట్రిక్ బుల్లెట్ బండిని తయారు చేసి అందరితో వావ్ అనిపించుకున్నాడు. రాజన్ తమ ఇంట్లో ఉన్న పాత రాయల్ ఎన్ ఫీల్డ్ సామాన్లను ఉపయోగించి ఈ బండిని తయారు చేశాడు. ఈ బండి గురించి రాజన్ మాట్లాడుతూ..ఎలక్ట్రిక్ బండి కంటే ముందు తాను ఎలక్ట్రిక్ సైకిల్ ను తయారు చేశానని చెప్పాడు.
అయితే అది స్పీడ్ కంట్రోల్ అవ్వలేదని ఫెయిల్ అయ్యిందని దాన్ని నడిపితే అతడికి కిందపడి గాయాలు అయ్యాయని చెప్పాడు. ఇక కరోనాతో స్కూల్లు మూత పడిన నాటి నుండి తాను ఎలక్ట్రిక్ బైక్ తయారీ మొదలు పెట్టానని తన పేరెంట్స్ సహాయంతో ఇంట్లో ఉన్న పాత రాయల్ ఎన్ ఫిల్డ్ ను ఎలక్ట్రిక్ బైక్ గా మార్చానని చెప్పాడు. ఈ సారి సక్సెస్ అయ్యా అని రాజన్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇక దానికి మొత్తం 40వేలు ఖర్చు వచ్చిందని చెప్పాడు.