టీ20 జట్టుకు కెప్టెన్ గా వైదొలుగుతున్నానంటూ విరాట్ కోహ్లీ ప్రకటించినప్పటి నుండి తర్వాతి కెప్టెన్ ఎవరనే విషయం ఆసక్తిగా మారింది. యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20 జట్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై చెప్పనున్నాడు. దీంతో ఆ తర్వాత కెప్టెన్ గా ఎవరు ఉండనున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సీనియర్లు కొన్ని కామెంట్లు చేస్తున్నారు. సీనియర్ ఆటగాడు దిలీప్ వెంగ్ సర్కార్ మాట్లాడుతూ, కోహ్లీ తర్వాత జట్టును నడిపించే సామర్థ్యం ఎవరికో ఉందో చెప్పేసాడు.
రోహిత్ శర్మ అయితే టీ20 జట్టును ముందుకు నడిపిస్తాడని, కాబట్టి టీ20 జట్టు సారథ్య బాధ్యతలు రోహిత్ శర్మకి ఇస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నాడు. ఇదివరకు టీ20 మ్యాచులకు చేసిన కెప్టెన్సీని పరిగణలోకి తీసుకుని, ఇంకా ఐపీఎల్ లో ముంబై జట్టుకు సారథ్యం వహించడాన్ని చూసుకుంటూ ఈ విషయాలు మాట్లాడుతున్నానని, 2018సంవత్సరంలో రోహిత్ శర్మ సారథ్యంలో ఆసియా కప్ గెలిచామన్న విషయాన్ని మర్చిపోకూడని గుర్తు చేసారు.