ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి మూడు రోజుల కస్టడీ

-

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం సాయంత్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్‌ను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది.

సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను తిరిగి జూన్ 29న(శనివారం) రాత్రి 7 గంటలలోగా కోర్టు ఎదుట హాజరుపర్చాలని రౌస్ అవెన్యూ కోర్టు వెకేషన్ బెంచ్ జడ్జి అమితాబ్ రావత్ ను ఆదేశించారు.అంతకుముందు వాదనలు వినిపించిన సీబీఐ తరఫు న్యాయవాది .. తమకు కేజ్రీవాల్‌ను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news