ప్రభాస్ కల్కి మూవీకి ఏపీ ప్రభుత్వము గుడ్ న్యూస్

-

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.రేపు రిలీజ్ కానున్న ప్రభాస్ కల్కి 2898AD సినిమా అదనపు షోకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఇప్పటికే 5 షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం రేపు ఉదయం 4.30 గంటల నుంచి 8 గంటలలోపు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో మరో షో వేసుకునేలా ఆదేశాలు జారీ చేసింది. చిత్ర నిర్మాతల విజ్ఞప్తితో భారీ రద్దీ, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.కాగా ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన ట్రైలర్ ,పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news