ఇప్పుడు ఎక్కడ చూసిన కెమికల్ మయం అయి పోయింది..ముఖ్యంగా మన తినే ఆహార పదార్థాలు ఎక్కువగా రసాయనలతో వస్తున్నాయి.. పంట బాగా దిగిబడి రావాలని అధిక మోతాదులో రసాయనిక ఎరువులను వాడుతూ కలుషితం చేస్తుంటే..మరోవైపు వ్యాపారులు పంటను ఎక్కువ కాలం నిల్వ ఉంచాలని రసాయనిక మందులను వాడి స్టోర్ చేస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు నోటికో, కోటికో ఒకరు ఉంటారు.అలాంటి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు ఢిల్లీలోని సోదరులు. జాత్ ఖోర్ కు చెందిన దాబాస్ కుటుంబానికి 2009లో అలాంటి ఒక సందర్భమే ఎదురైంది. మృణాల్, లక్షయ్ వాళ్ల అమ్మమ్మ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ ఘటన మృణాల్, లక్షయ్ కు ఆరోగ్యం ప్రాముఖ్యతను తెలియజెప్పింది.
పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో పండిన ఆహారాన్ని ఆమెకు ఇవ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం రోజు రోజుకు మెరుగవుతూ వస్తుంది.అయితే ఆమె కొన్నెల్ల క్రితం చనిపొయింది. అయినా కూడా సోదరులు ఇద్దరు సేంద్రీయ వ్యవసాయం చేయాలనీ అనుకున్నారు.కూరగాయలు, గోధుమలు, కందులు, ఆవాలు, వరి, మినుములు మరియు పండ్ల పంటల ఉత్పత్తిని పెంచారు ఇద్దరు అన్నదమ్ములు. ఆర్గానిక్ ఎకర్ బ్రాండ్ క్రింద ఆర్గానిక్ ఫుడ్ ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించారు. ప్రస్తుతం, వారు ఢిల్లీలో దాదాపు 5,000 కుటుంబాలకు నాణ్యమైన కూరగాయలను అందిస్తున్నారు. పంట పండిన 12 గంటలలోపు తాజా ఉత్పత్తులను అందిస్తారు.
అలాగే రైతులకు సేంద్రీయ పద్ధతుల్లో పంటలు ఎలా పండించాలి అనే వాటి మీద వర్క్ షాప్ ను కూడా నిర్వహిస్తున్నారు..ఏటా రూ.3.5 కోట్ల ఆదాయం సమకూరుతోంది.సంవత్సరం మొత్తం పంట చేతికందేలా చూసుకున్నారు. కాలానికి అనుగుణమైన పంటల సాగు చేస్తున్నారు..దాంతో నెల మొత్తం 4 లక్షల రూపాయల వరకూ ఆర్జిస్తున్నారు.కూరగాయల తో తేనే, నెయ్యి,మొదలగు వాటిని కూడా తయారు చేస్తున్నారు.మొత్తానికి వీరు చేస్తున్న వ్యవసాయం ప్రపంచ వ్యాప్తంగా ఫెమస్ అయ్యింది.