ఢిల్లీ: మద్యం డోర్ డెలివరీకి పర్మిషన్..

-

ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ నియమాలని తీసుకువచ్చింది. దాని ప్రకారం ఇకపై మద్యం డోర్ డెలివరీకి అనుమతి లభించింది. దానికోసం మొబైల్ల్ యాప్, వెబ్ సైట్ నుండి మద్యం డోర్ డెలివరీకి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మొత్తం 18కొత్త నియమాలని రూపొందించింది. వీటిల్లో బార్లు, రెస్టారెంట్లలోని ఓపెన్ ప్లేసుల్లో అనగా బాల్కనీల్లో మద్యం తాగవచ్చు. ఈ కొత్త నియమాలు 11వ తేదీ నుండి అమల్లోకి వస్తున్నాయని తెలిపింది. ఐతే మద్యం డోర్ డెలివరీ చేయడానికి రిటైలర్స్ అందరూ ఎల్- 13 అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ అనుమతులు ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా తీసుకోలేదు. ప్రభుత్వం కూడా హోమ్ డెలివరీకి సంబంధించిన విధానంలో మరికొన్ని నియమ నిబంధనలు సూచించనుంది. అందువల్ల ఇప్పుడప్పుడే ఈ ప్రక్రియ అమల్లోకి రావడం లేదు. అదలా ఉంటే, పబ్బులు, రెస్టారెంట్లు, హోటళ్ళలో టెర్రస్ పైన, ఓపెన్ బార్స్ నిర్వహించుకునే అవకాశాన్ని కూడా ఈ నియమాలు కల్పిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news