కరోనా పేషెంట్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన కవచ్ పర్సనల్ లోన్..!

-

దేశి దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ అవసరం లేని లోన్ ని తీసుకు వచ్చింది. అదే కవచ్ పర్సనల్ లోన్. ఈ లోన్ కరోనా ట్రీట్మెంట్ పేషంట్స్ కి పనికొస్తుంది. కరోనా పేషెంట్స్ కి మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ లోన్ వలన మంచి బెనిఫిట్స్ కలుగుతాయి.

కవచ్ పర్సనల్ లోన్/ sbi loans

ఈ లోన్ ఫెసిలిటీని తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే..? కరోనా వలన మెడికల్ ఖర్చులని పే చేయడానికి వీలవుతుందని ఎస్బీఐ దీనిని ప్రవేశపెట్టింది. ఈ స్కీం ని SBI చైర్మన్ దినేష్ ఖరా లాంచ్ చేశారు.

5 లక్షల వరకు ఎవరైనా లోను తీసుకోవచ్చు. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఏడాదికి 8.5 శాతంగా ఉంది. మొదట మూడు నెలలు ఈఎంఐ కట్టక్కర్లేదు అని ఎస్బీఐ చెప్పింది.

చాలా తక్కువ వడ్డీకి ఈ లోన్ తీసుకోవచ్చు. కవచ్ పర్సనల్ లోన్ స్కీమ్ ని ప్రవేశపెట్టేందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామని SBI చైర్మన్ దినేష్ అన్నారు. ఈ కొత్త స్కీం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు వున్న సరే కరోనా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అని అన్నారు. ఈ మహమ్మారి సమయంలో ఇది చాలా మందికి ప్రయోజనం కలిగిస్తుందని మేము భావిస్తున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news